స్కూల్స్ కు నాలుగు రోజులు సెలవులు
హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు రోజుల పాటూ సెలవులు ప్రకటించారు.
By M.S.R Published on 14 Jun 2024 5:35 PM ISTస్కూల్స్ కు నాలుగు రోజులు సెలవులు
హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు రోజుల పాటూ సెలవులు ప్రకటించారు. బక్రీద్ సందర్భంగా కొన్ని స్కూల్స్ కు నాలుగురోజులు సెలవులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఒక్కరోజు మాత్రమే సెలవు ప్రకటించింది. జూన్ 15 నుంచి 18 వరకు చాలా ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బక్రీద్ సెలవుల అనంతరం హైదరాబాద్‌లోని పాఠశాలలు జూన్ 19న పునఃప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే, బక్రీద్‌కు జూన్ 17 సోమవారం నాడు సెలవు ప్రకటించారు.
బక్రీద్ తర్వాత, హైదరాబాద్‌లోని పలు పాఠశాలలు బుధవారం తిరిగి తెరవబడతాయి. మిగిలినవి మంగళవారం నాడు తరగతులను పునఃప్రారంభిస్తారు. ఇక బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. గోవధ జరగకుండా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.