Hyderabad: బోనాల జాతర.. నగరంలో 'సే నో టు హలాల్' పోస్టర్లు

పండుగల సమయంలో హిందువులు హలాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పాతబస్తీలోని కార్వాన్, జియాగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పోస్టర్లు వెలిశాయి.

By అంజి  Published on  29 July 2024 7:30 AM GMT
Hyderabad, Say no to Halal, posters , Karwan, Jiyaguda

Hyderabad: బోనాల జాతర.. నగరంలో 'సే నో టు హలాల్' పోస్టర్లు 

హైదరాబాద్: పండుగల సమయంలో హిందువులు హలాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పాతబస్తీలోని కార్వాన్, జియాగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పోస్టర్లు వెలిశాయి. బోనాల జాతర సమయంలో ఈ పోస్టర్లు వెలియడం ఆసక్తికరంగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ రక్షిత్ సాగర్ ఈ పోస్టర్లను ఉంచారు. పండుగల సమయంలో హలాల్ ఉత్పత్తులను నివారించాలని ఆయన తన ఎక్స్‌ పోస్ట్‌లో హైదరాబాద్‌లోని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

“జై మాతా ది.. భాగ్యనగర్‌లోని కార్వాన్, జియాగూడ ప్రాంతంలోని వివిధ దేవాలయాల వద్ద సే నో టు హలాల్ బ్యానర్‌లను ఇన్‌స్టాల్ చేశారు. కనీసం మా పండుగల సమయంలోనైనా హలాల్, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని నా హిందూ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని రక్షిత్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఖాతాను కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య వంటి ప్రముఖ బీజేపీ నేతలు ఫాలో అవుతున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం రెండు రోజుల బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హిందూ రైట్ వింగ్ ప్రచారం చేసిన ఇటీవలి కుట్ర సిద్ధాంతాలలో హలాల్‌ జిహాద్ ఒకటి. హిందుత్వ సంస్థలు సృష్టించిన ఈ పదం, ముస్లిం సమాజం హలాల్ ఆహారాన్ని తినడం వల్ల హిందూ ఆహార వ్యాపారుల వ్యాపారం మూసివేయబడుతుందని ఆరోపించారు. చాలా హిందూ మితవాద సంస్థలు హలాల్ ఆహార పదార్థాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దానిని నిషేధించడానికి కేంద్రం ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

Next Story