Hyderabad: కుళాయిల్లో డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని 200 ఇళ్ల నుంచి ఫిర్యాదులు
సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని డీఎన్‌ఎం కాలనీలో 200కు పైగా ఇళ్లు కలుషిత తాగునీటితో అల్లాడిపోతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sep 2024 2:30 PM GMTహైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని డీఎన్‌ఎం కాలనీలో 200కు పైగా ఇళ్లు కలుషిత తాగునీటితో అల్లాడిపోతున్నాయి. తమ కుళాయిల నుంచి నలుపురంగు నీరు ప్రవహించడాన్ని గమనించారు. అవన్నీ డ్రైనేజీలో నీరంటూ కంప్లైంట్ చేశారు.
అధికారుల తక్షణ స్పందన
సమస్యను వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ, ఆమె బృందంతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. డాక్టర్ నీలిమ మాట్లాడుతూ, "ఈ రోజు నీటి కాలుష్యం కనిపించింది, అయితే ఇది కొంతకాలం కొనసాగుతూ ఉండవచ్చు. మేము సమస్యను దాని మూలంలో పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాము."
HMWSSB ద్వారా విచారణ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) కెమెరా పరికరాలను ఉపయోగించి కాలుష్యం ఎక్కడ జరుగుతుందో గుర్తించడానికి దర్యాప్తు చేస్తోంది. పనులు కొనసాగుతున్న వేళ బాధిత ఇళ్లకు నీటి ట్యాంకర్లను అందించాలని నీలిమ అధికారులను కోరారు. "సమస్య పూర్తిగా పరిష్కరించబడే వరకు, ఈ కలుషితమైన లైన్ల నుండి త్రాగునీరు రాకూడదని నేను పట్టుబట్టాను. మేము ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను కొనసాగిస్తాము" అని డాక్టర్ నీలిమ జోడించారు.
పలువురు స్థానికుల ఆందోళనలు
కులాయిల నుంచి డ్రైనేజీ నీరు రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొందరు మాట్లాడుతూ.. "మా కుళాయిల నుండి నల్లా నీరు రావడం చూసి షాక్ అయ్యాము. అదృష్టవశాత్తూ మేము దానిని తాగలేదు.. కానీ మేము తాగి ఉంటే ఏమి జరుగుతుందో ఆలోచిస్తే భయంగా ఉంది. ”అని DNM కాలనీ నివాసి సురేష్ అన్నారు.
మరో నివాసి ఫర్జానా కూడా ఇదే విధమైన ఆందోళనలను పంచుకుంది, "మా పిల్లలు, పెద్దల ఆరోగ్యం ఆందోళనగా మారింది. మనం సేవించే నీరు దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ప్రమాద సంకేతాలు కనిపించడం లేదు, భవిష్యత్‌లో పిల్లలు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులపై ప్రభావం తీవ్రంగా చూపుతుంది. కలుషిత నీటి సమస్యను త్వరలో పరిష్కరించబడుతుందని..మళ్లీ జరగదని మేము ఆశిస్తున్నాము. అని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా దీర్ఘకాలిక పరిష్కారాల ఆవశ్యకతను డాక్టర్ నీలిమ నొక్కి చెప్పారు. "డ్రెయిన్ పైపులను శుభ్రపరచడం, విస్తరించడం అవసరం. పురపాలక అధికారుల నిర్లక్ష్యం ఈ సమస్యలకు దారితీసింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తక్షణ, స్థిరమైన పరిష్కారాలను రూపొందించడానికి మేము సంబంధిత విభాగాలతో కలిసి పని చేస్తున్నాము."