Hyderabad: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, విద్యార్థి మృతి
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 9:25 AM ISTHyderabad: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, విద్యార్థి మృతి
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు ప్రమాదానికి గురైంది. మల్కం చెరువు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ICFAI యూనివర్సిటీలో BBA చదువుతున్న విద్యార్థి చరణ్ (19)గా పోలీసులు గుర్తించారు. BNR హిల్స్ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈరోడ్డు ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కాగా..ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో మల్కం చెరువు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. కాగా.. విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అతని కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.