హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన రాయదుర్గం భూవేలం పాటలో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు... మొత్తం 7.67 ఎకరాల భూమి రూ.1357.59 కోట్లకు అమ్ముడైంది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని రికార్డు స్థాయిలో ధర పలికింది...గతంలో కోకాపేట నియోపోలిస్ ప్రాంతంలో HMDA నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికిన రికార్డును రాయదుర్గం వేలం పాట బ్రేక్ చేసి రికార్డ్ స్థాయిలో చరిత్రను సృష్టించింది.