హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం, హత్య

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. హత్య చేశారు దుండగులు.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2023 1:45 PM IST
Hyderabad, Rape And Murder, nanakramguda, crime,

హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం, హత్య

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. హత్య చేశారు దుండగులు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

హైదరాబాద్లోని నానక్‌రాంగూడలో ఈ సంఘటన జరిగింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత బండరాయితో మోదీ దుండగులు చంపినట్లు ఘటనాస్థలిలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ శవం లభించింది. అయితే.. మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్‌ వడ్డెర బస్తీకి చెందిన కాశమ్మ (38)గా గుర్తించారు పోలీసులు.

కాగా.. కాశమ్మ మిస్సింగ్ అయ్యినట్లు ఆగస్టు 25న కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు లక్ష్మికి చెందిన డబ్బులను కాశమ్మ తీసుకుంది. దాంతో.. విషయం తెలుసుకున్న కూతురు లక్ష్మి తల్లితో గొడవపడింది. దాంతో.. మనస్థాపం చెందిన కాశమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ రోజంతా తల్లికోసం వెతికినా కనిపించలేదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తల్లి మిస్‌ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. అప్పుడు అదృశ్యమైన కాశమ్మ ఇప్పుడు శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్‌ తర్వాతే మహిళపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం తేలుతుందని అన్నారు. కాగా.. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలోనే దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

Next Story