ఫార్ములా కార్ రేసింగ్ చూసేందుకు టికెట్స్ కొన్న వారికి డబ్బు రీఫండ్

Hyderabad racing event cancellation IRL announces full refund. హైదరాబాద్ లో ఇటీవల ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) రద్దు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 19 , 20 తేదీల్లో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2022 9:32 AM GMT
ఫార్ములా కార్ రేసింగ్ చూసేందుకు టికెట్స్ కొన్న వారికి డబ్బు రీఫండ్

హైదరాబాద్ లో ఇటీవల ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) రద్దు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 19 , 20 తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్‌లు కొన్ని కారణాల వల్ల రద్దు చేశారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్ లో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించిన ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు చూసేందుకు టికెట్లు కొన్నవారికి తిరిగి డబ్బులు ఇస్తున్నట్టు ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రకటించింది. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ లో భాగంగా ప్రాక్టీస్ సమయంలో వరుస ప్రమాదాలు జరగడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ లో భాగంగా ప్రాక్టీస్ సమయంలో వరుస ప్రమాదాలు జరగడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. శని, ఆదివారాల్లో ఫార్ములా 3 స్థాయి కార్లతో ప్రాక్టీస్ మాత్రమే జరిగింది. ఆదివారం జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా ఫార్ములా 4 కార్ల పోటీలు నిర్వహించారు.

"ఇండియన్ రేసింగ్ లీగ్ నవంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్ రేస్ వీకెండ్ కోసం టిక్కెట్‌ను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ రీఫండ్‌ను జారీ చేస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి టికెట్లు కొన్న వారికి రీఫండ్ కు సంబంధించిన డబ్బులకు ఇమెయిల్ లేదా మెసేజీల ద్వారా తెలియజేస్తాం. మీ సహనం, మద్దతు ఎంతో అభినందనీయం" అని IRL తాజా ప్రకటనలో తెలిపింది. ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారులు కార్లలో ఒకటి పాడైపోవడంతో ఆదివారం జరగాల్సిన ఫైనల్ షో రద్దయిందని, ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తున్నామని తెలిపారు. "ఒక కారు దెబ్బతినడం వల్ల మేము అన్ని ఇతర కార్లను తప్పనిసరిగా తనిఖీ చేశాం. భద్రతా అంశం కారణంగా ఈవెంట్ ను రద్దు చేయాల్సి వచ్చింది" అని IRL అధికారి తెలిపారు. బుక్ మై షో ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరికీ తిరిగి చెల్లించాలని సూచించామని ఆయన తెలిపారు. రేసింగ్ ఈవెంట్ టిక్కెట్లు బుక్ మై షోలో అమ్మారు. రెండు రకాల పాస్‌లు ఉన్నాయి. ఒక రోజు రెగ్యులర్ టికెట్ ధర రూ.749 నుండి మొదలు కాగా.. మరొకటి రెండు రోజుల వారాంతపు పాస్ రూ.1249 నుండి ప్రారంభమైంది.

2023లో హైదరాబాద్‌లో జరగాల్సిన ఎఫ్‌ఐఏ ఫార్ములా ఇ రేసింగ్ ఈవెంట్‌ కోసం.. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే కారు ప్రమాదం కారణంగా ఆదివారం అకస్మాత్తుగా రేస్ ను రద్దు చేయడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. శనివారం, ప్రసాద్స్ ఐమాక్స్ ముందు చెట్టు కొమ్మ రేసింగ్ కారుపై పడడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. తదుపరి IRL ఈవెంట్ డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. రేసింగ్ ఈవెంట్ దేశంలోని ఏకైక స్ట్రీట్ సర్క్యూట్ అయిన 2.7 కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో జరుగుతోంది. 2.7కి.మీ రేస్ ట్రాక్ ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ రోడ్, సెక్రటేరియట్ కాంప్లెక్స్ చుట్టూ వెళుతుంది. ఈసారి చెన్నై టర్బో రైడర్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, గాడ్‌స్పీడ్ కొచ్చి, గోవా ఏసెస్.. ఈ ఆరు జట్లు రేసులో పాల్గొంటున్నాయి

Next Story
Share it