ఎల్బీన‌గ‌ర్‌లో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

Hyderabad police seized 110 kg Ganja in LB Nagar.తెలంగాణ‌ వ్యాప్తంగా గంజాయితో పాటు డ్రగ్స్ అమ్మకాలపై రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 1:22 PM IST
ఎల్బీన‌గ‌ర్‌లో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

తెలంగాణ‌ వ్యాప్తంగా గంజాయితో పాటు డ్రగ్స్ అమ్మకాలపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. దీంతో రాష్ట్ర నలుమూలలతో పాటు ప‌ట్ట‌ణాల్లో సైతం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారితో పాటు వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఇలా ఇప్పటికే కోట్ల రూపాయల గంజాయిని రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లై చేస్తున్న వారిపై కూడా పీడీ యాక్టులు సైతం నమోదు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రు కేటుగాళ్లు పోలీసులు క‌ళ్లు గ‌ప్పి గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్నారు.

తాజాగా ఎల్బీన‌గ‌ర్‌లో ఎస్ఓటీటీ పోలీసులు చేప‌ట్టిన త‌నీఖీల్లో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story