Hyderabad: ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు.. పైగా లైవ్‌ స్ట్రీమ్‌.. కేసు నమోదు

ట్యాంక్ బండ్ పై నుంచి ఇజ్రాయెల్ జెండాను కిందకు దించినందుకు పోలీసులు ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు.

By అంజి
Published on : 17 May 2025 10:05 AM IST

Hyderabad, Police, youth, Israeli flag, Tank Bund,  Miss World pageant

Hyderabad: ఇజ్రాయెల్ జెండాను తొలగించిన యువకుడు.. పైగా లైవ్‌ స్ట్రీమ్‌.. కేసు నమోదు

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై నుంచి ఇజ్రాయెల్ జెండాను కిందకు దించినందుకు పోలీసులు ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు.

మే 12, 2025న నగరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ జెండాను ఎగురవేసింది.

నిందితుడు జకీర్.. ఇజ్రాయెల్‌ జెండాను తీసివేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను పోస్ట్ చేశాడు.

యువకుడిపై కేసు నమోదు చేసిన తర్వాత, ప్రభుత్వ అధికారులు ట్యాంక్ బండ్‌పై జెండాను తిరిగి ఏర్పాటు చేశారు.

అయితే, మే 16న మరోసారి అదే యువకుడు ఇజ్రాయెల్ జెండాను తొలగిస్తూ కనిపించాడు. ఈ సంఘటన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.

ఒక ప్రత్యక్ష సాక్షి ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చాడు: “గౌరవనీయులైన సీవీ ఆనందర్‌, ఐపీఎస్‌, హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్ వరల్డ్-2025 పోటీ దృష్ట్యా, అనేక దేశాలు, వాటి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం ట్యాంక్‌బండ్ వద్ద అన్ని దేశ జెండాలను ఏర్పాటు చేసిన తర్వాత.. ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం కారణంగా కొన్ని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ `ఇజ్రాయెల్ జెండా'ను తొలగించిన వీడియోను పోస్ట్‌ చేశాయి.”

"ఇజ్రాయెల్ దేశ జెండాను తొలగించినట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. జెండాను తొలగించడం వల్ల రెండు స్నేహపూర్వక దేశాల (భారతదేశం - ఇజ్రాయెల్) మధ్య గందరగోళం ఏర్పడవచ్చు, కాబట్టి అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించి, దానితో సంబంధం ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. జెండాను ప్రభుత్వం ఏర్పాటు చేసినందున, PDPP చట్టం కూడా వర్తిస్తుంది" అని పేర్కొన్నారు.

Next Story