కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..పంజాగుట్ట పీఎస్‌లో కేసు

లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 6:18 PM IST

Hyderabad News, KA Paul, Punjagutta police, sexual harassment

హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే కేఏపాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పనిచేస్తున్న యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో ఉన్న తనను కేఏ పాల్ లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పేర్కొంది.

కేఏ పాల్ వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపుతున్నాడని, తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ షీ బృందాలను సంప్రదించింది. దర్యాప్తు తర్వాత షీ టీమ్ ఆ ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులకు పంపారు, దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story