2019లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఒక వ్యాపారి భార్యను 'చట్టవిరుద్ధంగా' నిర్బంధించినందుకు ఐదుగురు టాప్ GST అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు జె రాఘవి రెడ్డిని చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అధికారులు రాత్రంతా నిర్బంధించారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నగర పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
కేసు నమోదైన వారిలో జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్- చెన్నై, ఆనంద్ కుమార్, జీఎస్టీ కమిషనర్-కచ్, బొల్లినేని శ్రీనివాస గాంధీ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (సస్పెన్షన్లో ఉన్నారు), చిలక సుధా రాణి, డిప్యూటీ కమిషనర్ జీఎస్టీ (సస్పెన్షన్లో ఉన్నారు), ఇసాబెల్లా బ్రిట్టో ఉన్నారు. ఐదుగురు అధికారులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 341, 506 కింద కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేత కేసులో హైదరాబాద్‌కు చెందిన భరణి కమోడిటీస్ యజమాని సత్య శ్రీధర్ రెడ్డి పై GST అధికారులు సెర్చ్ ఆపరేషన్ సంఘటన 2019 నాటిది. ఈ కేసులో యజమానిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. సోదాల అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డిని అక్రమంగా జీఎస్టీ అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై నేషనల్ విమెన్ కమిషన్‌కి శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డి ఫిర్యాదు చేశారు. బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన హైదరాబాద్ పోలీసులు.. ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ సోదాల సమయంలోనే జీఎస్టీ అధికారులు తమను లంచం కూడా అడిగారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.