Hyderabad: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం పెగ్ మార్కింగ్ ప్రారంభం
హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం సర్వే పూర్తయిందని, గ్రౌండ్‌లో దాని అలైన్‌మెంట్ యొక్క పెగ్ మార్కింగ్
By అంజి Published on 28 Feb 2023 3:05 PM ISTఎయిర్‌పోర్టు మెట్రో కోసం పెగ్ మార్కింగ్ ప్రారంభం
హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం సర్వే పూర్తయిందని, గ్రౌండ్‌లో దాని అలైన్‌మెంట్ యొక్క పెగ్ మార్కింగ్ ప్రారంభించబడిందని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రోడ్డుపై సంప్రదాయ ఇంజినీరింగ్ పెగ్ మార్కులే కాకుండా, రాత్రి సమయంలో కనిపించేందుకు రెట్రో రిఫ్లెక్టివ్ షీట్‌తో కూడిన అల్యూమినియం బోర్డులు సెంట్రల్ మీడియన్‌లో పెడుతున్నామని, ఇవి చైనేజీని సూచిస్తాయని ఆయన అన్నారు. అంటే ఎయిర్పోర్టు మెట్రో ప్రారంభ స్థానం నుండి ఆ బోర్డు పెట్టిన ప్రదేశం వరకు దూరాన్ని అది సూచిస్తుందని ఎండీ వివరించారు.
ప్రతి 100 మీటర్లకు 0.1 కి.మీ నుండి 0.2 కి.మీ.. ఇలా చిన్నసైజు బోర్డులు వేస్తుండగా, ప్రతి అర కిలోమీటరుకు కాస్త పెద్ద బోర్డులు పెడుతున్నారు. బోర్డులు రాయదుర్గం నుండి బయోడైవర్సిటీ జంక్షన్ వరకు, ఖాజాగూడ రోడ్డులోని ఐటీ టవర్స్ నుండి నానక్‌రాంగూడ జంక్షన్ వరకు సెంట్రల్ మీడియన్‌లో పెడుతున్నారు. నానక్‌రాంగూడ జంక్షన్ నుండి టీఎస్‌పీఏ అప్పా జంక్ష వరకు సర్వీస్ రోడ్డు విస్తరణలో ఉన్నందున వాటిని ఫుట్‌పాత్ వైపు ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్ట్రెచ్‌లో సెంట్రల్ మీడియన్ లేదు. అయితే ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లు ఓఆర్‌ఆర్ వెంట నానక్ రాంగూడ జంక్షన్, టీఎస్‌పీఏ జంక్షన్ మధ్య విస్తరించిన సర్వీస్ రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.