Hyderabad: భార్యను కిరాతకంగా చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 11:58 AM ISTHyderabad: భార్యను కిరాతకంగా చంపి భర్త ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. గొడవల కారణంగా సొంతవారి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దారుణ సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న సాయినగర్‌లో రాములు, సంతోషి దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. గత కొన్నాళ్లుగా భార్య సంతోషిపై భర్త రాములు అనుమానం పెట్టుకున్నాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం పెరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ విషయంలోనే మరోసారి తాజాగా ఘర్షణ జరిగింది. ఈసారి గొడవ పెద్దది కావడంతో భర్త రాములు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు. క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొచ్చిన భార్యను పలుమార్లు కిరాతకంగా పొడిచాడు. అయితే.. తీవ్ర గాయాలపాలైన సంతోషి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇక హత్య అనంతరం రాములు సరూర్‌నగర్‌లో ఉంటోన్న తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. అక్కడి వెళ్లాక ఏం అనుకున్నాడో తెలియదు కానీ.. రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ రెండు ఘటనల గురించి పోలీసులకు సమాచారం అందడంతో.. రెండు మృతదేహాలను పోస్ఉమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోద చేశామని.. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.