Hyderabad: ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి పారిపోయిన 13 ఏళ్ల బాలిక

ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడకూడదని కుటుంబసభ్యులు ఆంక్షలు పెట్టడంతో 13 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది.

By అంజి  Published on  11 April 2024 6:54 AM IST
Hyderabad, Minor girl, phone usage

Hyderabad: ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి పారిపోయిన 13 ఏళ్ల బాలిక 

హైదరాబాద్: ఇటీవల కాలంలో పిల్లలు తమ మాటే నెగ్గాలని మొండిగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఇంట్లో ఓ శుభకార్యం ఉండటంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన బాలాజీ రావు తన ఫ్యామిలీతో కలిసి ఈనెల 8న హైదరాబాద్ కాచిగూడలోని సుందర్‌నగర్‌కు వచ్చాడు. 8వ తరగతి చదవే బాలాజీ కుమార్తె (13) అతిగా ఫోన్ మాట్లాడేది. హైదరాబాద్ వచ్చాక కూడా బాలిక ఫోన్‌లో అలాగే మాట్లాడింది.

ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడకూడదని కుటుంబసభ్యులు ఆంక్షలు పెట్టడంతో 13 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. ఏప్రిల్ 9, మంగళవారం ఉదయం, ఆమె సోదరుడు, తల్లి ఫోన్‌లో ఎక్కువ మాట్లాడకుండా ఆంక్షలు పెట్టడంతో, మైనర్ బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి యువతి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ బాలికను గుర్తించారు. ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Next Story