Hyderabad: ఐపీఎల్ మ్యాచ్ కోసం.. మెట్రో రైల్ సర్వీసుల పొడిగింపు
Hyderabad Metro Rail services extended IPL match
By అంజి
Hyderabad: ఐపీఎల్ మ్యాచ్ కోసం.. మెట్రో రైల్ సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఈరోజు హైదరాబాద్ మెట్రో రైలు సేవలను పొడిగించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయించారు. అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకునేలా చూడడానికి, మ్యాచ్‌కు రెండు గంటల ముందు రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత.. చివరి రైలు రాత్రి 12.30 గంటలకు స్టేడియం స్టేషన్ నుండి బయలుదేరుతుంది. షెడ్యూల్ చేయబడిన సమయాలకు మించి, స్టేడియం మెట్రో స్టేషన్‌లో మాత్రమే ప్రయాణిలకు ప్రవేశం అనుమతించబడుతుంది. ఇతర స్టేషన్లలో ఎగ్జిట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైలు ఒక ముఖ్యమైన రవాణా మార్గంగా మారింది. వేగవంతమైన, నమ్మదగిన సేవలతో, అభిమానులను సమయానికి స్టేడియంకు చేరుస్తోంది హైద్రాబాద్ మెట్రో రైలు.