Hyderabad: జిమ్‌కు వెళ్లే యువకులే వారి టార్గెట్‌.. స్టెరాయిడ్ ఇంజక్షన్లతో..

మీరు రోజు జిమ్ చేస్తున్నారా.. కండలు రావడానికి స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నారా.. అయితే తస్మా జాగ్రత్త.

By అంజి  Published on  27 Jun 2024 2:30 PM IST
Hyderabad, Steroid Injections, Bandlaguda, Gym

Hyderabad: జిమ్‌కు వెళ్లే యువకులే వారి టార్గెట్‌.. స్టెరాయిడ్ ఇంజక్షన్లతో.. 

హైదరాబాద్‌: మీరు రోజు జిమ్ చేస్తున్నారా.. కండలు రావడానికి స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నారా.. అయితే తస్మా జాగ్రత్త. సిక్స్ ప్యాక్ కావాలంటే స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవాలని జిమ్ యజమానులు చెప్పే మాటలు నమ్మకండి. అలా నమ్మారో.. ఇక మీరు అనారోగ్యం పాలైనట్టే.. హైదరాబాద్ నగరంలోని బండ్ల గూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిమ్ లలో స్టెరాయిడ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో డ్రగ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు జిమ్‌లపై దాడులు చేశారు. ఆ ప్రాంతంలో ఉండే చాలా జిమ్‌లు దేహదారుఢ్యం కోసం స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తున్నారు.

జిమ్ యజమాన్యులు వారి లాభం కొరకు జిమ్‌కు వచ్చే యువకుల కండలు పెంచేందుకు స్టెరాయిడ్ ఇంజక్షన్ లని సరఫరా చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ కావాలంటే తప్పనిసరిగా స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవాలని జిమ్ యజమానులు.. యువకులను ప్రేరేపిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమైన ఇంజక్షనో తెలియని అమాయకపు యువకులు ఇంజక్షన్లను తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే డ్రగ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు రంగంలోకి దిగి స్టెరాయిడ్ ఇంజక్షన్ అమ్ముతున్న సయ్యద్ ఫహద్ ను అరెస్టు చేశారు. ఇతను పలు జిమ్ లకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్ముతున్నాడు. పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి పెద్ద మొత్తంలో స్టెరాయిడ్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story