మిద్దెపై గంజాయి పెంపకం.. హైదరాబాద్ వ్యక్తి నిర్వాకం
ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు 10 గంజాయి మొక్కలను
By అంజి Published on 25 May 2023 11:15 AM GMTమిద్దెపై గంజాయి పెంపకం.. హైదరాబాద్ వ్యక్తి నిర్వాకం
ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సాయి రేవంత్ వర్మ అనే వ్యక్తి 200 గజాల విస్తీర్ణంలో తన ఇంటి డాబాపై గంజాయి పండిస్తున్నట్లు గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత వినియోగం కోసం మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి విత్తనాలను తీసుకొచ్చినట్లు రేవంత్ వర్మ పోలీసుల విచారణలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు అతని వద్ద ఉన్న గంజాయి విత్తనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అభియోగాలు మోపారు. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
మిర్చీ బజ్జీలను గంజాయితో చేసి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చందుర్తి సీఐ కిరణ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి రిజ్వాన్, విజయ్ లు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. రిజ్వాన్ మిర్చీ బజ్జీల్లో గంజాయి కలిపి తయారు చేసి విక్రయిస్తున్నారనే పక్కసమాచారంతో కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. అతని వద్ద నుంచి గంజాయి ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు.