బట్టల షాపింగ్ చేస్తూ సడెన్‌గా గుండెపోటుతో వ్యక్తి మృతి (వీడియో)

ఓ వ్యక్తి బట్టలు కొందామని హైదరాబాద్‌లో బట్టల షాప్‌కి వెళ్లాడు.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 6:15 PM IST
బట్టల షాపింగ్ చేస్తూ సడెన్‌గా గుండెపోటుతో వ్యక్తి మృతి (వీడియో)

ఉత్సాహంగా కనిపించిన ఓ వ్యక్తి బట్టలు కొందామని హైదరాబాద్‌లో బట్టల షాప్‌కి వెళ్లాడు. సాధారణంగానే ఉన్నాడు. బట్టషాపులోకి వెళ్లాక అక్కడున్న వారితో బాగానే మాట్లాడాడు. కానీ.. ఆ యువకుడు దుకాణంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌ వద్ద ఉన్న జాకీ షోరూమ్‌లో ఈ సంఘటన జరిగింది. కలాల్ ప్రవీణ్ కృష్ణ (37) అనే వ్యక్తి వ్యక్తి ఉన్నట్లుండి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అతను కిండ పడిపోవడాన్ని గమనించిన షాపులో ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అతని వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందని కంగారుపడిపోయారు. ఆ ఉద్యోగులు కిందపడిపోయిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. గుండెపోటు రావడం వల్ల చనిపోయాడని వెల్లడించారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Next Story