Hyderabad: బురఖా ధరించి బైక్‌ స్టంట్స్‌.. వీడియో వైరల్‌.. కట్‌ చేస్తే..

హైదరాబాద్ నగరంలో ఆగస్టు 19వ తేదీ సోమవారం బురఖా ధరించి బైక్‌పై విన్యాసాలు చేసిన వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

By అంజి
Published on : 20 Aug 2024 10:00 AM IST

Hyderabad, man booked , bike stunts, burqa

Hyderabad: బురఖా ధరించి బైక్‌ స్టంట్స్‌.. వీడియో వైరల్‌.. కట్‌ చేస్తే.. 

హైదరాబాద్: నగరంలో ఆగస్టు 19వ తేదీ సోమవారం బురఖా ధరించి బైక్‌పై విన్యాసాలు చేసిన వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని రోడ్లపై ఇద్దరు యువకులు బురఖా ధరించి విన్యాసాలు చేస్తూ, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో కేసు బుక్ చేయబడింది.

వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది చివరకు ఐఎస్ సదన్ పోలీసులకు చేరింది. సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వీడియో చిత్రీకరించిన ఇతర వ్యక్తులు పరారీలో ఉన్నారు. బురఖా ధరించిన వ్యక్తి రోడ్లపై అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించాడని, వారి దగ్గర ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వారిని భయపెట్టాడని పోలీసులు ఆరోపించారు.

Next Story