Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు

హైదరాబాద్: నగరంలోని ప్రధాన విద్యా కూడలి అయిన అమీర్‌పేట్‌లో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.

By -  అంజి
Published on : 20 Feb 2026 11:47 AM IST

Hyderabad, Major fire breaks out, Ameerpet, coaching centre

Hyderabad: అమీర్‌పేట్ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు విద్యార్థులు కిటికీల నుండి బయటకు దూకేందుకు ప్రయత్నించగా, అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది స్పందించి వారిని సురక్షితంగా కిందకు దింపుతున్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు భవనం లోపలే ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలను వేగవంతం చేసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదం మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Next Story