ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు, ఇతర అధికారులు చెబుతున్నా కొందరు పెడచెవిన పెట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇక కొందరు అర్ధరాత్రి వేళల్లో ఎవరూ చూడట్లేదు కదా అంటూ షార్ట్ రూట్ అంటూ రాంగ్‌రూట్‌లో దూసుకొస్తుంటారు. ఎల్‌బీనగర్‌లో కూడా గత అర్ధరాత్రి ఓ కారు ఇలానే నడిపారు. వారి నిర్లక్ష్యంపు డ్రైవింగ్‌తో ఓ నిండు ప్రాణం బలైందిపోయింది.
ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారును నిర్లక్ష్యంగా నడుపుతూ.. యూటర్న్ చేసుకున్నాడు. ఆ తర్వాత కారుని రాంగ్ రూట్‌లో తీసుకెళ్లాడు. ఇక సడెన్‌గా ఒక బైక్ వచ్చి కారుని వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. అయితే.. మృతిచెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు.
ఇక ఇదే ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ కాజావల్లి మోహినుద్దిన్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్‌బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరు అయ్యి తిరిగి క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.