హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2023 4:56 AM GMT
Hyderabad, Junior artist, murder,  jubilee hills,

హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు. అయితే... ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలుకు చెందిన టి.సాయి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. యూట్యూబర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోన్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత అతడి ప్రవర్తనను నచ్చక సాయిని సదురు యువతి దూరం పెట్టింది. ఈ క్రమంలో ఆ యువతికి కార్తిక్ అనే మరో యువకుడు దగ్గరయ్యాడు. గత నెలలో ఇద్దరూ కలిసి యూసుఫ్‌గూడలోని కార్తిక్ సోదరుడు శంకర్‌ గదికి వెళ్లి మూడ్రోజులు అక్కడే ఉన్నారు. కాగా. .ఈ విషయం తెలుసుకున్న సాయి తట్టుకోలేకపోయాడు.

నేరుగా కార్తిక్ దగ్గరకు వెళ్లి అతడితో గొడవపెట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. అలా అయితేనే తన ప్రేయసి తనకు దక్కుతుందని భావించాడు. స్నేహితులైన విజయనగరం జిల్లాకు చెందిన సురేశ్, రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్‌ సాయంతో హత్యకు పథకం వేశాడు. గత నెల 13న రెండు బైక్‌లపై కార్తిక్‌ గదికి వెళ్లారు. ఆ యువతి దుస్తులు కొన్ని తమ గదిలో ఉన్నాయని.. వాటిని తీసుకెల్లాలని నమ్మించారు. బైక్‌పై ఎక్కించుకుని ఓల్డ్‌ బోయినపల్లి పాత ఎయిర్‌పోర్టు మార్గంలో అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. మార్గ మధ్యలో కార్తిక్‌ను బైక్‌పై నుంచి కింద పడేసి దాడి చేశారు. ఆ తర్వాత చెట్టుకు కట్టేసి తమ వెంట తెచ్చుకున్న కత్తితో పక్కటెముకల్లో పొడిచారు. ఆ తర్వాత పీక కోశారు. బండరాయితో తలపై కొట్టి చంపేశారు. అతడు ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయారు.

అయితే.. మృతుడి సెల్‌ఫోన్‌ను తీసుకుని సురేశ్‌ నగరంలో ఉడిపోయాడు. కొద్దిరోజుల తర్వాత సురేశ్‌ తన దగ్గరున్న ఫోన్ కార్తీక్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత అది ఆన్‌ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆచూకీ తెలుసుకుని కార్తిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ గట్టిగా అడగ్గా విషయం మొత్తం తెలిపాడు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య ఘటనలో యువతి ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story