నిన్న రాత్రి సమయంలో ట్యాంక్ బండ్లో రెండు బోట్లలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే అయితే ఈ ప్రమాదంలో ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు.. నాగారం కు చెందిన అజయ్ (21) అనే యువకుడు నిన్న రాత్రి సమయంలో హుస్సేన్ సాగర్ లో స్నేహితులతో కలిసి బోటులో ప్రయాణి స్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అజయ్ స్నేహితులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ అజయ్ జాడ తెలియలేదు.. పోలీసులు అజయ్ ఏ హాస్పిటల్లో లేడు అని అంటున్నారు. అసలు అజయ్ ఎక్కడికి పోయాడు? అజయ్ కి ప్రమాదం జరిగిందా లేక పోతే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడా? ఒకవేళ ప్రాణాలతో బయటపడితే అజయ్ ఎక్కడ? ఇలా పలు కోణాల్లో పోలీసులు అజయ్ కోసం గాలింపు చర్యలు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అజయ్ జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు...
పోలీసులు హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆప రేషన్ నిర్వహిం చారు.రెండు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. నాగరానికి చెందిన అజయ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి భరతమాతకు మహా హారతి కార్య క్రమం చూడడానికి ట్యాంక్ బండ్ వద్దకు వచ్చాడు. రాత్రి సమయంలో బాణ సంచా కాలుస్తూ ఉండగా ప్రమాద వశాత్తు హుస్సేన్ సాగర్ లో రెండు బోట్లు దగ్ధమైనవి. అప్పటి నుండి అజయ్ కనబడ కుండా పోయాడు. . అజయ్ తో పాటు వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఏ హాస్పిటల్ వెతికినా కూడా అజయ్ జాడ తెలియరాలేదు... అందుకే పోలీసులు హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు...