రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్‌, యువకుడు మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. కొందరు యువత రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 12:30 PM IST
Hyderabad, hayathnagar, reels, bike, accident, young man dead,

 రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్‌, యువకుడు మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. కొందరు యువత రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. కొన్ని ఘటనల్లో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైనవారు ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో ఇద్దరు యువకులు రీల్స్‌ కోసం బైక్ స్టంట్స్ చేశారు. ప్రమాదవశాత్తు కిందడి ఒకరు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద అంబర్పేట్ సమీపంలో జాతీయ రహ దారిపై వర్షంలో కెటిఎమ్ బైక్ పై ఇద్దరు యువకులు వింత వింత విన్యాసాలతో స్టంట్స్ చేస్తూ రీల్స్ చేయడం మొదలుపెట్టారు. వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో ఉన్నాయి. దాంతో.. బైక్ ఒక్కసారిగా అదుపు తప్పింది. బైక్ వెనుకాల కూర్చోని ఉన్న శివ అనే యువకుడు అమాంతం ఎగిరి రోడ్డు మీద పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడి కక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలివేయగా ఆ రోడ్లపై ఈ యువకులు బైక్ లతో ఓవర్ స్పీడ్‌తో రీల్స్ కోసం స్టంట్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. బైకులపై ప్రమాదకరమైన స్టంట్స్ వేసి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదంటూ పోలీసులు ఎన్నో మార్లు హెచ్చరించినా యువత మారడం లేదు. మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story