Hyderabad: ఘోర ప్రమాదం, బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో
సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు ఆటో దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 10:56 AM ISTHyderabad: ఘోర ప్రమాదం, బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో.. అదుపుతప్పిన ఆటో బస్సు వెనకాల నుంచి ఢీకొట్టి.. బస్సు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.
హబ్సిగూడలో రోడ్డుపై ఆర్టీసీ బస్సు వెనకాలే ఆటో వెళ్తుంది. అందులో డ్రైవర్‌తో పాటుగా.. ఒక స్కూల్ విద్యార్థిని మాత్రమే ఉన్నారు. అయితే.. అప్పుడే వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో.. అదుపు తప్పిన ఆటో ముందున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అతివేగంగా ఉన్న కారణంగా బస్సు కిందకు చొచ్చుకుని వెళ్లింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యింది. టెన్త్ విద్యార్థిని గాయపడి ఇరుక్కున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. తీవ్రగాయాల పాలైన విద్యార్థినిని, ఆటో డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
కాగా..ఈ ప్రమాదంలో గాయపడ్డ బాలిక వివరాలను పోలీసులు గుర్తించారు. స్వాత్విక అనే విద్యార్థిని గౌతమ్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నది. ఈ విద్యార్థిని స్కూల్ కి వెళ్లడానికి తార్నాక నుండి హబ్సిగూడకు ఆటోలో బయలుదేరినట్లుగా పోలీసులు చెప్పారు. ఆటో డ్రైవర్ కూడా సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. సాత్విక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని హబ్సిగూడ క్రాస్‌రోడ్‌లో బస్సును ఆటో ఢీకొనడంతో గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, ఆటో రిక్షా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ఆటోను క్రేన్‌తో లాగారు. pic.twitter.com/Mjz3gARQHe
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 17, 2024