హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. క్రెసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో ఇవాళ ఉదయం 5 గంటలకు పేలుడు సంభవించింది, ఐదుగురు గాయపడ్డారు. ఒక బాధితుడి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. పేలుడు తీవ్రతకు పొరుగున ఉన్న హోటల్ హరి దోస భవనం వద్ద గోడ కూలిపోయింది. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అడిక్‌మెట్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తూ బైక్ అదుపు తప్పడంతో కిందపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.