అవ‌న్నీ పూర్తిగా పుకార్లే.. హైదరాబాదులో పెట్రోల్, డీజిల్ కొరత వార్త‌ల‌పై సీపీ, కలెక్టర్ క్లారిటీ

హైదరాబాదులో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని హైదరాబాద్ నగర పోలీసులు, జిల్లా యంత్రాంగం స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 25 March 2026 3:34 PM IST

అవ‌న్నీ పూర్తిగా పుకార్లే.. హైదరాబాదులో పెట్రోల్, డీజిల్ కొరత వార్త‌ల‌పై సీపీ, కలెక్టర్ క్లారిటీ

హైదరాబాదులో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని హైదరాబాద్ నగర పోలీసులు, జిల్లా యంత్రాంగం స్పష్టం చేశారు. ప్రజలు ఈ తప్పుడు సమాచారం నమ్మి పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలైన్లలో నిలబడుతున్నారని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలోని 186 పెట్రోల్ బంకులలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోందన్నారు. కొందరు సోషల్ మీడియా పోస్టుల వల్ల అనవసర భయం ఏర్పడి కృత్రిమ డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. అటువంటి పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. నగరంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుమారు 60 రోజుల అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ముందుగానే ఇంధనం నిల్వ చేసుకోవడం కూడా అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. అధికారులతో కలసి పరిస్థితిని సమీక్షించామని, అన్ని బంకుల వద్ద సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే నిరాధార వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Next Story