Hyderabad: నేడే మెస్సీ - సీఎం రేవంత్‌ మ్యాచ్

ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ది గోట్‌ టూర్‌లో భాగంగా సాకర్‌ దిగ్గజం ఇవాళ సాయంత్రం 4...

By -  అంజి
Published on : 13 Dec 2025 7:28 AM IST

Hyderabad, Friendly football match, Messi, CM Revanth, Uppal Stadium

Hyderabad: నేడే మెస్సీ - సీఎం రేవంత్‌ మ్యాచ్

ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ది గోట్‌ టూర్‌లో భాగంగా సాకర్‌ దిగ్గజం ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లి తొలుత ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌, తర్వాత సీఎం రేవంత్‌ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడతారు.

చివరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్‌ బరిలో దిగుతారు. ఈ ఈవెంట్‌కు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. కాగా మ్యాచ్‌ అనంతరం ఫొటో సెషన్‌ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10 లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్‌ చేసుకున్నట్టు హైదరాబాద్‌ గోట్‌ టూర్‌ అడ్వైజర్‌ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌ జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌ కోసం 27 వేల టికెట్లు బుక్‌ అయ్యాయి.

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ కోల్‌కతా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన్ను భారీ సెక్యూరిటీ మధ్య పోలీసులు కారు ఎక్కించారు. మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్‌ అయ్యారనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ లోపలికి పరుగులు తీసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తమ ఫేవరెట్‌ ప్లేయర్‌ను నేరుగా చూసేందుకు శుక్రవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఎదురుచూశారు.

Next Story