హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు.
కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ వేశారు. ఇందులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చారు. హుస్సేన్‌సాగర్ పరిరరక్షణ బాధ్యతలను హైడ్రా పర్యవేక్షిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు.