హైదరాబాద్ మొదటి మహిళా మేయర్ రాణి కుముదిని దేవి
Hyderabad First Mayor Rani Kumudini Devi.. రాణి కుముదిని దేవి వరంగల్ జిల్లాలోని వడ్డెపల్లి లో జనవరి 23, 1911 నాడు జన్మ
By సుభాష్
హైదరాబాద్‌కు ఎందరో మేయర్‌లు పదవి బాధ్యతలు చేపట్టారు. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నువ్వానేనా అన్నట్లు ఆయా పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. నగరంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కొనగుతోంది. అయితే ఈ సారి మేయర్ పదవిని మహిళకు కేటాయించారు. ఇక హైదరాబాద్ తొలి మహిళ మేయర్ రాణి కుముదిని దేవి. ఈమె వరంగల్ జిల్లాలోని వడ్డెపల్లి లో జనవరి 23, 1911 నాడు జన్మించారు. రాణి కుముదిని దేవి తండ్రి గారు పింగళి వెంకటరామారెడ్డి గారు నైజాం రాష్ట్రానికి ఉప ప్రధానమంత్రిగా పని చేశారు.హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తరువాత వెంకటరామారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కుముదిని దేవి వనపర్తి సంస్థానానికి చెందిన జనుంపల్లి రాజారాందేవ్ రావుని వివాహం చేసుకున్నారు.
కుముదిని దేవి నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా మరియు హైదరాబాద్ తొలి మహిళా మేయర్ గా (1962 లో) ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు స్రుష్టించారు. కుముదిని దేవి 1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్తానానికి ప్రాతినిద్యం వహించారు.కుముదిని దేవి గారు కుష్టు వ్యాది రోగుల కోసం శివానంద పునరావాస కేంద్రం అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది రోగులను ఆదుకున్నారు. కుముదిని దేవి ఆగస్టు 6, 2009 నాడు 98వ యేట కన్నుమూశారు.
కాగా, ఈ సారి మేయర్ సీటు మహిళకు కేటాయించడంతో ప్రముఖ పార్టీలు అధికంగా మహిళలను బరిలో దింపుతున్నాయి. ఈ సారి మేయర్ తమకంటే తమకేనని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు మహిళలకు అధిక స్థానాలను కేటాయిస్తున్నారు.