హైదరాబాద్‌లో ఫర్నీచర్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం

హైదారాబాద్‌లో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పనామా గోడౌన్‌ సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్‌ షాపులో పెద్ద ఎత్తున మంటలు

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2023 6:40 AM IST

Fire Accident, Hyderabad, Furniture Shop, Vanastalipuram

హైదరాబాద్‌లో ఫర్నీచర్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం

హైదారాబాద్‌లో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పనామా గోడౌన్‌ సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్‌ షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో.. స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌ నగరంలోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనామా దగ్గర ఉన్న విడమ్‌ ఫర్నీచర్‌లో ఉన్నట్లుండి శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫర్నీచర్‌ షాపు కావడంతో మంటలు తొందరగా వ్యాపించాయి. దుకాణంలో ఉన్న సామాగ్రి అంతా మంటలకు ఆహుతయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్క దుకాణాదారులు భయపడిపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు.

Next Story