హైదరాబాద్: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కొత్త వ్యూహాన్ని వెలికి తీశారు. పసుపు (హల్దీ) పౌడర్ ప్యాకెట్లలో గంజాయి విక్రయాలను సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఛేదించారు. ధూల్‌పేటకు చెందిన నేహా బాయి అనే మహిళ మోసపూరిత వ్యూహాన్ని అవలంభించి, యువకులకు గంజాయిని విక్రయిస్తోంది. తాజాగాను ఆమెను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి పట్టుకోవడంతో ఈ కొత్త విధానం బయటపడింది.
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్, ఎస్‌ఐ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. "పసుపు లాంటి ప్యాకేజింగ్ ఉపయోగించి గుర్తించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసారు" అని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు.