హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసకుంది. విద్యుత్తు ఉద్యోగిపై వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. సనత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ పరిధిలోని లైన్ ఇన్‌స్పెక్టర్ హెచ్.శ్రీకాంత్, మీటర్ రీడర్ పి.సాయిగణేష్ గురువారం మోతీనగర్‌లోని కబీర్‌నగర్ ప్రాంతానికి మీటర్ రీడింగ్ కోసం వెళ్లారు. సాయిగణేష్ టి.రాములు నివాసానికి వెళ్లి పెండింగ్‌లో ఉన్న బిల్లు రూ.6,858 చెల్లించాలని కోరారు. దాంతో.. ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. అయితే వెంకటస్వామి కుమారుడు మురళీధర్ రావు(19) డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. అధికారులు అతని నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
దీంతో కోపోద్రిక్తుడైన కిక్‌బాక్సర్ మురళీధర్‌రావు సాయిగణేష్‌పై దాడి చేశాడు. శ్రీకాంత్ జోక్యం చేసుకోవడంతో అతనిపై కూడా దాడి జరిగింది. సాయి గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడిని ఖండిస్తూ 1535 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా కరెంటు బిల్లులు చెల్లించమని అడిగేందుకు వెళ్లారని తెలిపారు. అయితే, వారిని చాలా దారుణంగా కొట్టడాన్ని ఖండించారు. మీటర్ రీడర్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని తెలిపారు.