ఒకేసారి నలుగురు పిల్లలు.. హైదరాబాద్ డాక్టర్ల అరుదైన సర్జరీ

హైదరాబాద్‌లోని మినా ఆసుపత్రి వైద్యులు అరుదైన, ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2024 5:13 AM GMT
hyderabad,  complex surgery, deliver four babies ,

ఒకేసారి నలుగురు పిల్లలు.. హైదరాబాద్ డాక్టర్ల అరుదైన సర్జరీ 

హైదరాబాద్‌లోని మినా ఆసుపత్రి వైద్యులు అరుదైన, ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. 26 ఏళ్ల మహిళ నలుగురు శిశువులకు జన్మనివ్వడానికి వైద్యులు శస్త్ర చికిత్సను నిర్వహించాల్సి వచ్చింది. డాక్టర్ సాహిబా షాకూర్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఆ మహిళ ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

26 ఏళ్ల అస్మా (పేరు మార్చాం) కు స్కాన్‌లో నాలుగు పిండాలు ఉన్నాయని తెలియడంతో మినా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అప్పటి నుండి, ఆసుపత్రి బృందం ఆమె గర్భధారణ సమయంలో ప్రత్యేక సంరక్షణ, పర్యవేక్షణను అందించింది. డాక్టర్ షకూర్, డాక్టర్ ఇష్రత్, డాక్టర్ రమణ ప్రియ బృందం శస్త్రచికిత్స చేసి నలుగురు ఆరోగ్యవంతమైన శిశువులు ఈ ప్రపంచాన్ని చూడడానికి తోడ్పాటును అందించారు. "పిల్లల బరువు 1.3 కిలోల నుండి 1.5 కిలోల మధ్య ఉంటుంది" అని డాక్టర్ చెప్పారు. చిన్నారుల వైద్య నిపుణులు డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు.

మినా హాస్పిటల్ ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి నాలుగు విజయవంతమైన ఆపరేషన్లు జరిగాయి. డాక్టర్ షకూర్ బృందం గైనకాలజీ విభాగంలో ఛాలెంజింగ్ టాస్క్‌లను స్వీకరించడంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Next Story