'పొగమంచులో ఔటర్, హైవేలపై జాగ్రత్త'.. వాహనదారులకు సైబరాబాద్ పోలీసుల సలహా
చలికాలం వచ్చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. తీవ్ర చలితో పాటు పొగమంచు కూడా కురుస్తోంది.
By - అంజి |
'పొగమంచులో ఔటర్, హైవేలపై జాగ్రత్త'.. వాహనదారులకు సైబరాబాద్ పోలీసుల సలహా
హైదరాబాద్: చలికాలం వచ్చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. తీవ్ర చలితో పాటు పొగమంచు కూడా కురుస్తోంది. ఈ క్రమంలోనే పొగమంచులో పాదాచారులు, ద్విచక్రవాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కావున ముఖ్యంగా పాదాచారులు, ద్విచక్రవాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR), హైవేలు, ప్రధాన నగర రహదారులపై అధిక జాగ్రత్త అవసరమని సూచించారు. ఈ మేరకు పలు పోలీసులు పలు సూచనలు చేశారు.
కొన్ని సూచనలు..
- పాదచారులు పొగమంచు పడే సమయం లో రోడ్లపైకి రాకండి; అవసరమైతే మాత్రమే బయటకి రావాలి.
- రోడ్లను దాటేటప్పుడు రెండు వైపులా చూసి జాగ్రత్తగా రోడ్డు దాటాలి.
- నల్లటి లేదా మసక బట్టలు ధరిస్తే డ్రైవర్లు మిమ్మల్ని గమనించలేరు; కాంతివంతమైన దుస్తులు ధరించండి.
- రోడ్లపై వేగంగా నడవకండి, ప్రత్యేకంగా జంక్షన్లు, వంపు రోడ్ల దగ్గర జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
- పొగ మంచు పడే సమయం లో రోడ్లపైకి రాకుండా ఉండడం అత్యంత సురక్షితం.
- ద్విచక్రవాహనదారులు పొగమంచులో వేగంగా వెళ్ళకండి నెమ్మది గా ముందుకు సాగండి.
- హెడ్‌లైట్స్, ఫాగ్ లైట్లు, టెయిల్ లైట్లు పరిశుభ్రంగా ఉంచి సరిగ్గా ఆన్ చేయండి.
- వాహనాల మధ్య కనీస సురక్షిత దూరం పాటించండి.
- బ్రేక్ ఒక్కసారిగా కాకుండా సాఫీగా వాడండి.
- టర్న్ లేదా లేన్ మార్పు ముందు ఇండికేటర్స్ ఆన్ చేయండి.
- రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించండి, హెల్మెట్ వైజర్ పరిశుభ్రంగా ఉంచండి.
- రెండు చేతులతో స్టీరింగ్ పట్టండి; డ్రైవింగ్ సమయంలో మొబైల్ లేదా ఇతర దృష్టి మళ్లించే పనులు చేయవద్దు.
- వాహన రిఫ్లెక్టర్లు స్పష్టంగా ఉంచండి.
- టార్చ్, రిఫ్లెక్టర్లు, అవసరమైన టూల్స్‌తో ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉంచండి.
- గ్రిప్ ఉన్న టైర్లు వాడండి.
- విండ్షీల్డ్ పరిశుభ్రంగా ఉంచి డిఫాగర్ / యాంటీ ఫాగ్ మోడ్ ఉపయోగించండి.
- లేన్ మార్పులు చేయవద్దు; లేన్ మార్కింగ్‌లను గమనించండి.
- టూ-వీలర్ వాహనదారులు ఉదయం వేగంగా వెళ్ళకూడదు.
- క్రూయిజ్ కంట్రోల్ వాడకండి.
- వాహనం ఆపినప్పుడు మాత్రమే హజార్డ్ లైట్లు ఆన్ చేయండి.
- డ్రెస్ మరియు హెల్మెట్ వైజర్ పరిశుభ్రంగా ఉంచండి.
- రోడ్లలో అడ్డంకులు, వంపులు, జంక్షన్ల దగ్గర వేగాన్ని తగ్గించండి.
- పొగమంచు ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించండి.
- ఒకసారి వేగాన్ని నెమ్మదిగా పెంచండి లేదా తగ్గించండి; ఒక్కసారిగా వేగ నియంత్రణ మార్పులు చేయకండి.
- పెద్ద వాహనాలు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వేసుకోవాలి; హెడ్లైట్లు, టెయిల్ లైట్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి.
- ORR మరియు హైవేల్లో పొగమంచు తీవ్రంగా ఉండే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
- ఎమర్జెన్సీ సమయంలో ఎడమ వైపు లేన్‌లో వాహనాన్ని ఆపండి; అకస్మాత్తుగా ఆపవద్దు.
- డ్రైవర్ తగిన విశ్రాంతి తీసుకోవాలి; అలసట ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుంది.