డ్రగ్స్ బ్యాచ్‌లు ప్యాకప్ చేసుకుని వెళ్లిపోవాలని హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందని, చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీగా ఉంటామని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌కు డిమాండ్ ఉందని, త్వరలో వారితో సమావేశం పెడతాం అని తెలిపారు.
''హైదరాబాద్ పోలీసింగ్ లో అనేక సవాళ్లు వున్నాయి.. డ్రగ్స్ లాంటి సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తాను, క్విక్ రెస్పాన్స్ అనేది చాలా కీలకం.. ప్రజలకు త్వరగా సాయం చేయాలన్నది మా పోలీసు కర్తవ్యం.. ర్యాగింగ్ ను సహించేది లేదు.. షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తాం.. హైదరాబాద్‌ని డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తాం.. సైబరాబాద్ , రాచకొండ కమిషనర్‌లతో కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రగ్స్ ను నిర్మూలిస్తాం'' అని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలని.. లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాను హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు. బుధవారం ఉదయం రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.