సదర్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
By అంజి Published on 14 Nov 2023 7:08 AM GMTసదర్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 14 మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి నవంబర్ 15 తెల్లవారుజామున 3 గంటల వరకు నారాయణగూడలోని వైఎంసీఏలో జరుపుకోనున్న దీపావళి సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఈ పండుగలో దేశవ్యాప్తంగా వివిధ జాతుల గేదెలను ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ముషీరాబాద్‌లో ప్రారంభమయ్యే ఊరేగింపు నారాయణగూడలోని వైఎంసిఎ వద్ద ముగుస్తుంది. మంగళవారం రాత్రి ఈ లొకేషన్ చుట్టూ కింది ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
> కాచిగూడ క్రాస్‌రోడ్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇది కాచిగూడ కూడలి వద్ద టూరిస్ట్ హోటల్ వైపు మళ్లించబడుతుంది.
> విట్టల్‌వాడి క్రాస్‌రోడ్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇది కింగ్ కోఠి రోడ్డులోని భవాన్స్ న్యూ సైన్స్ కళాశాల వద్ద రాంకోటి కూడలి వైపు మళ్లించబడుతుంది.
> స్ట్రీట్ నెం. 08 నుండి ట్రాఫిక్ అనుమతించబడదు. రెడ్డి కళాశాల వద్ద బర్కత్‌పురా వైపు మళ్లించబడుతుంది.
> పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇది క్రౌన్ కేఫ్ లేదా బాగ్ లింగంపల్లి వైపు మళ్లించబడుతుంది.
> పాత ఎక్సైజ్ ఆఫీస్ లేన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. దానిని విట్టల్‌వాడి వైపు మళ్లిస్తారు.
> బర్కత్‌పురా చమన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. ఇది బర్కత్‌పురా క్రాస్‌రోడ్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లించబడుతుంది.
> బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ (నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) నుండి రెడ్డి కాలేజీ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. దీనిని నారాయణగూడ కూడలి వైపు మళ్లిస్తారు.
> సికింద్రాబాద్ నుండి కోఠికి వచ్చే ఆర్టీసీ బస్సులు వైఎంసీఏ సర్కిల్,నారాయణగూడ కూడలి నుండి రహదారిని తప్పించి, బదులుగా బర్కత్‌పురా, బాగ్ లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ల నుండి వెళ్లాలని పోలీసులు కోరారు.
> సదర్ మేళాకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కళాశాల, మెల్కోటే పార్క్ లేదా దీపక్ థియేటర్‌లో పార్క్ చేయాలని కోరారు.