ప్రజలను కొట్టిన మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు నమోదు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాదచారులను, ప్రయాణికులను అనవసరంగా కొట్టినందుకు మొగల్‌పురా ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌పై ఫిర్యాదు నమోదైంది.

By అంజి  Published on  17 July 2024 8:23 AM IST
Hyderabad, Moghalpura inspector, thrashing, public

ప్రజలను కొట్టిన మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు నమోదు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాదచారులను, ప్రయాణికులను అనవసరంగా కొట్టినందుకు మొగల్‌పురా ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌పై ఫిర్యాదు నమోదైంది. పోలీసుల 'యాక్షన్' కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

సామాజిక కార్యకర్త ఫిర్యాదు ప్రకారం, హైదరాబాద్ పోలీసుల మిషన్ చబుత్రలో భాగంగా మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ రాత్రిపూట ప్రజలను కొట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తమ ఇళ్ల వెలుపల అర్థరాత్రి వేళల్లో యువత ఎక్కువగా ఉండకుండా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు. గతంలో కూడా పోలీసులు అతిగా ప్రవర్తించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. సోషల్ మీడియాలో వాయూరల్ అవుతున్న వీడియోలో, ఇన్‌స్పెక్టర్, ఇతర పోలీసు అధికారులు ప్రజలను కొట్టడమే కాకుండా ప్రజలను ప్రశ్నించడం చూడవచ్చు. మొగల్‌పురా ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు మిషన్ చబుత్రకు స్వస్తి పలకాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సౌత్ జోన్‌ ను కోరారు.

Next Story