Video: మండి బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్‌లో ఘటన

మండి బిర్యానీ తింటుండగా అందులో బొద్దింక రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.

By -  అంజి
Published on : 10 Sept 2025 12:37 PM IST

Hyderabad, Cockroach, Biryani , ArabianMandi Restaurant, Musheerabad

Video: మండి బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌: మండి బిర్యానీ తింటుండగా అందులో బొద్దింక రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన నగరంలోని ముషీరాబాద్‌లోని అరేబియన్‌ మండి రెస్టారెంట్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది ఫ్రెండ్స్‌ కలిసి ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వెయిటర్ తెచ్చి ఇవ్వగానే.. తినడం ప్రారంభించారు. తింటుండగా బిర్యానీలో బొద్దింక కనిపించింది.

దీంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇదేంటని రెస్టారెంట్‌ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బిర్యానీలో బొద్దింక ఎలా వచ్చింది? అని అడిగితే సముదాయించి బయటకు పంపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లు రెస్టారెంట్ ముందు ఆందోళన చేయగా.. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పి పంపించారు. కాగా సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story