Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సుల్లో యూపీఐ సేవలు

టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణికుల కోసం UPI ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టినట్టైంది.

By అంజి  Published on  3 March 2025 7:56 AM IST
Hyderabad, City Buses, UPI Payments, Passengers

Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సుల్లో యూపీఐ సేవలు 

హైదరాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణికుల కోసం UPI ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టినట్టైంది. కండక్టర్లు టికెటింగ్ మిషన్ లో ఛార్జీని ఇన్‌పుట్ చేసి క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తాడు. ప్రయాణీకుడు చెల్లింపు చేయడానికి UPI యాప్‌ QR కోడ్‌ స్కాన్ చేసి చెల్లింపు చేస్తాడు. ఆ తర్వాత కండక్టర్‌ టికెట్‌ ఇస్తాడు. ఈ డిజిటల్ చెల్లింపు పద్ధతిని మొదట జిల్లా బస్సులలో ప్రారంభించారు. చాలా మంది UPI చెల్లింపులు ద్వారా చిల్లర, చిన్న నాణేలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయని ఆశిస్తున్నారు. ఇది ప్రస్తుతం పరిమిత సంఖ్యలో నగర బస్సులలో మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు ఆర్టీసీ తెలిపింది.

త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ వెల్లడించింది. "చాలా బస్సులకు కొత్త స్కానర్ టికెట్ యంత్రాలు వచ్చాయి, కానీ చాలా వాటికి ఇంకా అవి అందలేదు. కానీ అవి త్వరలో వస్తాయి" అని ఓ బస్ కండక్టర్‌ అన్నారు. కూకట్‌పల్లి డిపో నుండి కండక్టర్ అయిన వెంకటేశ్వర్లు, UPI-ఎనేబుల్డ్ మెషీన్ కలిగి ఉన్నారు, "కొత్త వ్యవస్థ బాగుంది. ఇది మాకు కండక్టర్లకు, ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటుంది. చెల్లింపులలో ఎటువంటి ఆలస్యం లేదు. ప్రస్తుతానికి మేము ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడం లేదు" అని అన్నారు. కాచిగూడ నుండి బోయిగూడకు సాధారణ ఆర్టీసీ ప్రయాణీకుడు ఐ. శ్రీనాథ్ మాట్లాడుతూ, "బస్సుల్లో యూపీఐ సేవలు రావడంతో నేను చాలా ఉపశమనం పొందాను. నేను ఇకపై చిన్న చిల్లర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

Next Story