Hyderabad: కాచిగూడ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా కారు.. వీడియో

నవంబర్ 13, గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని చాదర్‌ఘాట్-గోల్ ఖానా అండర్‌పాస్ కింద ఒక కారు వదిలివేయబడి కనిపించింది.

By -  అంజి
Published on : 14 Nov 2025 7:50 AM IST

Car left abandoned, Kacheguda underpass, probe on, Hyderabad

Hyderabad: కాచిగూడ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా కారు.. వీడియో

హైదరాబాద్: నవంబర్ 13, గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని చాదర్‌ఘాట్-గోల్ ఖానా అండర్‌పాస్ కింద ఒక కారు వదిలివేయబడి కనిపించింది. గురువారం సాయంత్రం సుమారు 7:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నింబోలి అడ్డ వద్ద ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జ్ వద్దా రోడ్డుకు అడ్డంగా TS 11UA 7868 బూడిద రంగు కారుని రోడ్డుకు అడ్డంగా నిలిపి వెళ్లిపోయాడు. స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈస్ట్ జోన్ డీసీపీ బి బాలస్వామి విలేకరులతో మాట్లాడుతూ, ఆ వాహనం బాలాజీ అనే వ్యక్తికి చెందినదని, అతను దానిని సమీర్ అనే మరో వ్యక్తికి ఇచ్చాడని అన్నారు. సమీర్ మద్యం తాగి ఉండి, మద్యం మత్తులో తన కారును వదిలి వెళ్లి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. సాధారణ ట్రాఫిక్ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి పోలీసులు కారును అక్కడి నుంచి తొలగించారు.

Next Story