Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. వీడియో

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం నాడు ఉదయం కారు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on  19 Nov 2024 9:37 AM IST
Hyderabad, Car crash, Banjara Hills

Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. వీడియో

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం నాడు ఉదయం కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం వేగంగా వచ్చిన కారు శ్రీనగర్‌ కాలనీ మెడ్‌ప్లస్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ స్టేషన్‌ నుంచి పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులను పిక్‌ డ్రాప్‌ చేసే కారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులు యాదయ్య (40), యాదగిరి (51) ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో వివాహానికి వెళ్తున్నారు. చింతన్‌పల్లి గ్రామం వద్దకు రాగానే బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆమనగల్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి వెంకటేష్ తెలిపారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story