Hyderabad: శామీర్పేట్‌లో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్ శామీర్ పేట్ లో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తాపడింది.

By అంజి  Published on  26 July 2024 10:29 AM IST
Hyderabad, Car Collided Private Bus, Shameerpet

Hyderabad: శామీర్పేట్‌లో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌: మితిమీరిన వేగం అనర్థాలకు దారితీస్తుంది. ఈ వేగం కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కొల్పోతున్న ఘటనలు జరుగుతున్న కూడా యువతలో ఏమాత్రం మార్పు రావడం లేదు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. తాజాగా శామీర్పేట్‌లో కారు బీభత్సం సృష్టించింది. మజీద్ పురా చౌరస్తాలో అతివేగంతో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు ఎదురు రోడ్డులో వస్తున్న ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story