Hyderabad: పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. వ్యాపారి మృతి

జూన్ 30 ఆదివారం రాత్రి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా పడిన ఈ ఘటనలో ఓ వ్యాపారి మృతి చెందాడు.

By అంజి  Published on  1 July 2024 9:47 AM IST
Hyderabad, Businessman , car overturn, PVNR expressway

Hyderabad: పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. వ్యాపారి మృతి

హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన థార్ కారు పిల్లర్ నెంబర్ 296 దగ్గర ఢీ వైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. జూన్ 30 ఆదివారం రాత్రి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా పడిన ఈ ఘటనలో ఓ వ్యాపారి మృతి చెందాడు. ఆ వ్యక్తిని మలైలార్‌దేవ్‌పల్లికి చెందిన గణేష్‌గౌడ్‌ (27)గా గుర్తించారు. గణేష్ మెహదీపట్నం నుంచి ఆరామ్‌గఢ్‌కు వస్తుండగా రాజేంద్రనగర్ సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మహీంద్రా థార్ బోల్తా పడింది.

దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు 150 స్పీడ్ తో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.

Next Story