కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న 'న్యూగో' ఎలక్ట్రికల్ బస్సు పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ దగ్గర బోల్తా పడింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 19 మృతదేహాలను రికవర్ చేశామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కోయ వెల్లడించారు. చిన్నటేకూరు వద్ద ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక బైకు బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగిందని పోలీసులు తెలిపారు. పలువురు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.