Hyderabad: ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా, మద్యం మత్తులో డ్రైవర్
హైదరాబాద్‌లోని నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ పై ఆదివారం రాత్రి ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 9:15 AM ISTHyderabad: ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా, మద్యం మత్తులో డ్రైవర్
హైదరాబాద్‌లోని నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ పై ఆదివారం రాత్రి ప్రమాదం సంభవించింది. ఒక ప్రయివేట్ బస్సు మితిమీరిన వేగంతో వెళ్లూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు నడపడమే కారణమని నార్సింగి పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గచ్చిబౌలి నుంచి రాత్రి బయల్దేరింది. అయితే.. బస్సు అక్కడి నుంచి బయల్దేరిన 15 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. 150 కిలోమీటర్ల అతివేగంతో బస్సు ఓఆర్ఆర్ పై ప్రయాణించింది. వర్షం వల్ల రహదారి తడిగా ఉండటం, మలుపు తీసుకునే క్రమంలో బస్సు అదుపు తప్పింది. దాంతో డివైడర్ ను ఢీకొట్టింది. అతివేగం కారనంగా డివైడర్‌ను దాటి బస్సు పక్క రహదారిపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బోల్తా పడింది. కిటికీ అద్దాలు పగిలి మమత అనే మహిళ కిందపడిపోయింది. ఆమె పైనుంచి బస్సు పడిపోయింది. దాంతో.. ఆమె సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది.
మిగతా ప్రయాణికులు తలకు, చేతులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రహదారిపై అడ్డుగా బస్సు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్పా జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు, స్థానికులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన మరొకరు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని.. మద్యం మత్తులో అతివేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి పోలీసులు తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగ్ దగ్గర అదుపు తప్పి ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ముంబై వెళ్తుండగా మార్నింగ్ స్టార్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. మరో 16 మంది గాయాలపాలు అయ్యారు. బస్సు బోల్తా పడటంతో రాత్రి… pic.twitter.com/8E8EwEgi1K
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 24, 2024