Hyderabad: రామనవమి ర్యాలీలో గాడ్సే ఫోటో ఊపిన వ్యక్తి అరెస్ట్
మార్చి 30న శ్రీరామనవమి శోభాయాత్ర (ర్యాలీ) సందర్భంగా గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే చిత్రాన్ని ఊపిన వ్యక్తిని
By అంజి Published on 13 April 2023 3:30 PM ISTHyderabad: రామనవమి ర్యాలీలో గాడ్సే ఫోటో ఊపిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: మార్చి 30న శ్రీరామనవమి శోభాయాత్ర (ర్యాలీ) సందర్భంగా గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే చిత్రాన్ని ఊపిన వ్యక్తిని షాహినాయత్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గచ్చిబౌలిలోని సిద్దిఖ్‌నగర్‌లో గల శ్రీలక్ష్మీ బాయ్స్ పీజీ హాస్టల్‌లో ఉంటున్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ చింతా హేమ కుమార్ (21)గా గుర్తించారు. అతడు బీజేపీ కార్యకర్త కూడా. కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలోని బండారు లంక వద్ద వల్లూరి వారి వీధికి చెందినవాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1948లో మహాత్మాగాంధీని బహిరంగంగా కాల్చి చంపిన నాథూరామ్ ఫోటోను కుమార్ తీసుకువెళ్లాడు.
కుమార్ ఫోటోగ్రాఫ్ పట్టుకుని ఊరేగింపులో వెళుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 502 (2) (వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తన సృష్టించడం లేదా ప్రచారం చేయడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రామనవమి ర్యాలీలో, గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ప్రధాన ఊరేగింపు మంగళ్‌హాట్ మీదుగా వెళ్లినప్పుడు చేరారు. అక్కడే గాడ్సే చిత్రపటం కనిపించింది. రాజాసింగ్ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఫోటోలు ఊపారు.