ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిల్స్ పంపిణీ.. మంచి మనసు చాటుకున్న హైదరాబాద్‌ బైకర్‌

హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

By అంజి
Published on : 5 April 2023 11:20 AM

traffic police, Hyderabad, Hyderabad biker

ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిల్స్ పంపిణీ.. మంచి మనసు చాటుకున్న హైదరాబాద్‌ బైకర్‌

హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి తాపాన్ని తట్టుకుని పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు మోటర్‌బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి తనదైన శైలిలో సహాయం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మోటో వ్లాగర్ నిఖిల్ నాయక్ అనే వ్యక్తి వేడి వాతావరణంలో చెమటలు పట్టినా, విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిళ్లను అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్‌లో.. నాయక్ తన బైక్‌పై ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వైపు వెళుతున్నట్లు చూడవచ్చు. అతను వారి వద్దకు వెళ్లినప్పుడు, అతను తన బ్యాక్‌ప్యాక్ నుండి వాటర్ బాటిళ్లను తీసి కృతజ్ఞతతో ఉన్న అధికారులకు అందజేస్తాడు. నాయక్ చేసిన మంచి పనికి ట్రాఫిక్‌ పోలీసులు నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపారు. నాయక్ యొక్క దయగల చర్య నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి వీడియో దాదాపు ఐదు లక్షల సార్లు లైక్ చేయబడింది. చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ, నాయక్‌ మంచి పనిని మెచ్చుకున్నారు.

Next Story