Hyderabad: బైక్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు.. వీడియో

సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.

By అంజి
Published on : 7 April 2025 3:52 PM IST

Hyderabad, Bike catches fire, Kukatpally , rising temperatures

Hyderabad: బైక్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు.. వీడియో

హైదరాబాద్: సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు వేగంగా స్పందించి, బకెట్లలో నీళ్ళు, దుకాణాల నుండి సిమెంట్ సంచుల మాదిరిగా కనిపించే వాటిని తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలు మరింత వ్యాపించకుండా మంటలను అదుపు చేసి ఆర్పివేశారు. అయితే, వాహనం దాదాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక పోలీసు అధికారులు కూడా సహాయ చర్యల్లో పాల్గొని నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో దంచి కొడుతున్న ఎండల కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రజలు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని చెబుతున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉంది.

Next Story