హైదరాబాద్: చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు బిజెపి తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ వి.శిల్పా రెడ్డిని అనుమతించాలని తెలంగాణ హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య 100 మంది మహిళలు పాల్గొని, చార్మినార్ దగ్గర గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ పండుగను నిర్వహించేందుకు డాక్టర్ వి.శిల్పా రెడ్డిని అనుమతించాలని జస్టిస్ బొల్లం విజయసేన్ రెడ్డి చార్మినార్ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించారు.
పండుగ స్థలంలో డిజె మ్యూజిక్ సిస్టమ్‌ను ఉపయోగించకుండా పిటిషనర్‌ను నిరోధించాలని, పాల్గొనేవారు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, విఐపిలను బతుకమ్మ ఆలయానికి ఆహ్వానించవద్దని కోర్టు ఎసిపిని ఆదేశించింది. శుక్రవారం భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు నిరాకరించిన చార్మినార్ ఏసీపీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ వి.శిల్పా రెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్‌ను కోర్టు విచారించింది.